లోయలో పడిన మినీ బస్సు- ఆరుగురు మృతి - జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్జు ప్రమాదం
![లోయలో పడిన మినీ బస్సు- ఆరుగురు మృతి accident in jammu kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11375978-thumbnail-3x2-acci.jpg)
16:16 April 12
లోయలో పడిన బస్సు- ఆరుగురు మృతి
జమ్ముకశ్మీర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. దోడా నుంచి కహారాకు వెళుతున్న మినీ బస్సు లోయలో పడిపోయింది. దోడా జిల్లా కేంద్రానికి 42కిమీ దూరంలోని పియాకుల్ గ్రామం వద్ద గల థాత్రి-గండో లోయలో ఈ బస్సు పడిపోయినట్లు దోడా డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో కనీసం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటివరకూ ఐదు మృతదేహాలను వెలికి తీశారు అధికారులు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వివరించారు.