తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ సిటీలో ఒకే రోజు ఐదుగురు సూసైడ్.. అసలేం జరిగింది? - జంషెద్​పుర్ న్యూస్

24 గంటల వ్యవధిలోనే ఐదుగురు ఆత్మహత్యలకు పాల్పడడం ఝార్ఖండ్​లోని జంశెద్​పుర్​లో కలకలం రేపింది. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు పోలీసులు. ఆ ఘటనలపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

suicide
ఆత్మహత్యలు

By

Published : Jul 29, 2022, 11:28 AM IST

ఝూర్ఖండ్ జంశెద్​పుర్​​లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపాయి. 24 గంటల వ్యవధిలో (బుధ- గురువారాల్లో) ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందులో ఒక చర్చి ఫాదర్​ కూడా ఉన్నారు. నగరంలో పెరుగుతున్న ఆత్మహత్యల దృష్ట్యా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కారణాలు తెలుసుకునే పనిలో పడింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసులను ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

జంశెద్​పుర్ నగరంలోని పలు పోలీస్​ స్టేషన్ల పరిధిలో ఐదు ఆత్మహత్యలు వెలుగుచూశాయి. సూసైడ్​ చేసుకున్న వారిలో గొల్మూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్చి ఫాదర్ లియో జాన్ డిసౌజా(52) కూడా ఉన్నాడు. బుధవారం ఆయన తన గదిలో ఉరివేసుకున్నారు. మరోవైపు బిర్సానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిలీప్(46) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కమల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంకుచియాకు చెందిన జలధార్(60) అనే వృద్ధుడు, బోడం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు, సక్చి పోలీస్ స్టేషన్ సమీపంలోని రాంలీలా మైదాన్​కు చెందిన సంజయ్​ శర్మ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఐదు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. జంశెద్​పుర్​లో ఆత్మహత్యల నివారణకు 'జీవన్' అనే సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్ధ డిప్రెషన్‌లో ఉన్న వారిని సంప్రదించి వారికి కౌన్సెలింగ్‌ ఇస్తుంది.

ఇవీ చదవండి:మరో యువకుడు దారుణ హత్య.. సీఎం పరామర్శకు వెళ్లి వస్తున్నప్పుడే..

మృతదేహాన్ని తాడుకట్టి ఈడ్చుకెళ్లి.. ట్రాక్టర్​లో ఎక్కించి..

ABOUT THE AUTHOR

...view details