బంగాల్ దక్షిణ దినాజ్‌పుర్ జిల్లాలోని జమల్పుర్లో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలను వారి ఇంట్లోనే గుర్తించారు. వారు హత్యకు గురైనట్లు భావిస్తున్నారు పోలీసులు. వీరిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి - family found dead in West Bengal
బంగాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వీరు హత్యకు గురైనట్లు అనుమానం వ్యక్తం చేశారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఘటనపై కేసు నమోదు చేసి హత్యలా లేక ఆత్మహత్యలా అనే కోణంలో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. శవపరీక్ష కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:దేశంలో కొత్తగా 45,674 కరోనా కేసులు