కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ట్రక్కును ఢీకొట్టగా.. ఒకే కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు మహిళలే.
కుకనూర్ తాలూకా బిన్యాల్ గ్రామానికి చెందిన దేవప్ప కొప్పడ్(62) తన కుటుంబంతో కలిసి.. కొప్పల్‌లోని తమ బంధువుల ఇంట్లో బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. శనివారం రాత్రి ఇంటికి తిరిగివస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు కుకనూర్లోని భానుపుర్ వద్ద ట్రక్కును ఢీకొట్టింది. రాత్రి 10.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబంలోని ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులు మృతి.. ఆదివారం ఉదయం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సమీపంలో జరిగింది. పోలీసు సిబ్బంది కర్ణాటక బెంగళూరులోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు ఆ రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర.
డ్రగ్స్ విక్రయించే ఓ వ్యాపారి చిత్తూరులో ఉన్నాడన్న సమాచారంతో.. అతడిని పట్టుకునేందుకు వెళ్తుండగా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. మృతదేహాలను, క్షతగాత్రులను బెంగళూరుకు తరలించారు.