తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూలీల వ్యాను, బస్సు ఢీ- ఐదుగురు మృతి - తమిళనాడులో రోడ్డు ప్రమాదం

తమిళనాడులోని దుండిగల్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందగా 60 మందికిపైగా కూలీలకు గాయపడ్డారు.

తమిళనాడు రోడ్డు ప్రమాదాలు దుండిగల్, four killed in dindigul road accident
కూలీల వ్యానును ఢీకొట్టిన బస్సు

By

Published : Mar 29, 2021, 3:06 PM IST

Updated : Mar 29, 2021, 5:48 PM IST

తమిళనాడు దుండిగల్​ జిల్లా వతల్కుండు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బస్సు, వ్యాను ఢీకొన్న ఈ ఘటనలో మరో 62 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని మధురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ధ్వంసమైన బస్సు
ప్రమాదానికి గురైన వ్యాన్​

ఓ ప్రభుత్వ బస్సు, మిల్లు వర్కర్లతో ప్రయాణిస్తున్న వ్యాను పరస్పరం ఢీకొనడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. 16 మంది పరిస్థితి విషమంగా ఉంది.

టైరు పేలిన కారణంగా బస్సు అదుపు తప్పి వ్యాన్​ను ఢీకొన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి :అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Last Updated : Mar 29, 2021, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details