ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపుర్ చౌరాసి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా దూసుకువచ్చిన ఎస్యూవీ కారు నియంత్రణ కోల్పోయి.. రెండు బైక్‌లతో పాటు సైకిల్‌ను ఢీ కొట్టిందిని పోలీసులు తెలిపారు. ఆపై ఎస్యూవీ దారి పక్కన ఉన్న గుంతలో పడిందని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులు రాకేశ్, అతని తండ్రి రాజారామ్, కుమారుడు రితిక్‌గా గుర్తించారు. మరో ఇద్దరు ఆషిశ్, సౌరభ్ అని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే ఎస్యూవీ డ్రైవర్ పారిపోయినట్లు అధికారులు వివరించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.