Five Drowned in Beach: సముద్రంలో ఈతకు వెళ్లిన 13 ఏళ్ల బాలుడు సహా.. అతడిని రక్షించేందుకు వెళ్లిన మరో ముగ్గురు మరణించారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని కెల్వే బీచ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది

నాసిక్‌లోని బ్రహ్మ వ్యాలీ కళాశాల విద్యార్థులు పాల్ఘర్లోని కెల్వే బీచ్ సందర్శనకు వెళ్లారు. అల్పపీడనం కారణంగా కెల్వేకు చెందిన ఓ బాలుడు అకస్మాత్తుగా సముద్రంలో మునిగిపోవడాన్ని వారు గమనించారు. అతడిని రక్షించేందుకు నలుగురు విద్యార్థులు సముద్రంలోకి వెళ్లారు. ఈ ఘటనలో బాధిత బాలుడితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఓ విద్యార్థి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
బాధిత బాలుడు కెల్వేకు చెందిన అథర్వ నాగ్రేగా గుర్తించగా.. అతడిని రక్షించేందుకు వెళ్లిన మిగతా ముగ్గురిని నాసిక్‌కు చెందిన ఓం విస్పుటే(17), దీపక్ వడకటే(17), కృష్ణ షెలార్లుగా(17) అధికారులు గుర్తించారు. స్థానికుల సహాయంతో నాలుగు మృతదేహాలను అధికారులు వెలికి తీశారు.
ఇదీ జరిగింది:'వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సి రావడం.. గత పాలకుల వల్లే'