తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి! - up crime news

ఉత్తర్​ ప్రదేశ్​లో కల్తీ మద్యం తాగి ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.

country-made liquor
నాటు సారా తాగి ఐదుగురు మృతి

By

Published : Apr 28, 2021, 3:13 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని హాథ్రస్​లో విషాదం జరిగింది. కల్తీ మద్యం తాగి.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. హాథ్రస్​లోని నాగ్లా ప్రహ్లదా, నాగ్లా సింఘి ప్రాంతాల్లో బుధవారం ఈ ఘటన జరిగింది.

ఈ ప్రాంతాల్లోని ప్రజలు.. స్థానిక దేవత ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో నాటు సార సేవించారు. ఈ క్రమంలో పలువురు ఆస్వస్థతకు గురయ్యారు.

మద్యం సరఫరా చేసిన రామహరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కల్తీ మద్యం వల్ల ఈ ఘటన జరిగిందా? లేదా మద్యంలో ఏదైనా విషం కలిసిందా? అనేది.. దర్యాప్తు తర్వాత తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కరోనా మృతులకు 'మెర్సీ ఏంజెల్స్' అంత్యక్రియలు

ఇదీ చూడండి:ఇంటి కప్పు కూలి ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details