వర్షాల కారణంగా రాజస్థాన్ బూందీ జిల్లాలో ఇల్లు కూలిపోయింది. మంగళవారం రాత్రి కేశవరాయపాటన్లో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మొదట ఐదు మృతదేహాలను గుర్తించగా.. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు.
వర్షాలకు కూలిన ఇల్లు- ఏడుగురు సజీవ సమాధి - బూందీ జిల్లా న్యూస్
రాజస్థాన్ బూందీ జిల్లాలో వర్షాల కారణంగా ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు.
కూలిన ఇల్లు, బూందీ
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది.. శిథిలాల తీవ్రగాయాలతో ఉన్న ఓ మహిళను, బాలికను ఆసుపత్రికి తరలించారు. కానీ, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
Last Updated : Aug 4, 2021, 7:28 PM IST