ఐఈడీ బాంబు పేలుడులో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. భద్రతా బలగాలు.. నక్సల్స్ ఏరివేతకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఝార్ఖండ్‌లోని ఛాయిభాసాలో జరిగిందీ ఘటన. క్షతగాత్రులను రాంచీలోని ఓ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
రెచ్చిపోయిన నక్సల్స్.. ఐదుగురు జవాన్లకు గాయాలు - ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అరెస్ట్
ఐఈడీ బాంబు పేలుడులో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. భద్రతా బలగాలు.. నక్సల్స్ ఏరివేతకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఝార్ఖండ్‌లో జరిగిందీ ఘటన. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందారు. ఐదుగురు మావోస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐఈడీ పేలుడు
సీఆర్పీఎఫ్ జవాన్ మృతి..
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మరణించారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. బీజాపుర్‌లోని పామర్ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారిలో తెలం నగేష్, గుండి లింగయ్య, గుండి రామారావు, శ్యాము, కరమ్ కామా ఉన్నారు. నిందితులందరినీ పోలీసులు కోర్టులో హాజరుపరిచి అనంతరం జైలుకు తరలించారు.
Last Updated : Jan 11, 2023, 6:50 PM IST