మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విషాదం జరిగింది. ఆక్సిజన్ కొరతతో గెలాక్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు కరోనా రోగులు మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
'ఆక్సిజన్ కొరత లేదు'