Covid XBB variant : అమెరికా, ఇంగ్లాండ్‌లో భారీగా కరోనా కేసులు పెరగడానికి కారణమైన కరోనా వైరస్ ఉప రకం ఎక్స్‌బీబీ 1.5.. భారత్‌లోనూ వెలుగుచూసింది. దేళంలో ఇప్పటివరకు 5 కేసులు బయటపడ్డాయని జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్ఫార్షియం(ఇన్ఫాకాగ్) తెలిపింది. గుజరాత్లో మూడు, కర్ణాటక, రాజస్థాన్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
ఒమిక్రాన్‌కు చెందిన సబ్‌వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 అమెరికాలో 40.5 శాతం కేసులు పెరగడానికి కారణమైంది. ఇంగ్లాండ్, న్యూయార్క్‌లో ఏకంగా 75 శాతం కేసులు పెరగడానికి ఈ వైరస్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీఏ.2 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ నుంచి ఎక్స్‌బీబీ పుట్టుకొచ్చినట్లు వివరిస్తున్నారు.
తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ కారణమని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఎక్స్‌బీబీ 1.5 ఉపరకం కారణంగా పలు దేశాల్లో కేసులు పెరిగినప్పటికీ భారత్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వైద్యనిపుణులు అంటున్నారు. మన దేశంలో ఇప్పటికే.. 80 శాతానికిపైగా ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారని గుర్తుచేస్తున్నారు. ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ 1.5 సబ్ వేరియంట్లను మొదట భారత్‌లోనే గుర్తించినట్లు చెబుతున్నారు.