తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జలాశయంలో మునిగి ఐదుగురు దుర్మరణం - ఐదుగురు యువకులు దుర్మరణం

తమిళనాడులోని దిండిక్కల్​ జిల్లాలో విషాదం జరిగింది. జలాశయంలో స్నానానికి అని వెళ్లిన ఐదుగురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

dead
తమిళనాడులో ఐదుగురి దుర్మరణం

By

Published : Mar 15, 2021, 9:47 AM IST

తమిళనాడులోని దిండిక్కల్ జిల్లా సెంబట్టి సమీపంలోని ఆత్తూరు డ్యామ్​లో మునిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. ఆదివారం జలాశయంలో వీరు స్నానం చేస్తుండగా ఒకరు నీట మునిగారు. అతన్ని కాపాడే ప్రయత్నంలో మిగిలిన నలుగురు కూడా మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మృతదేహాలను వెలికి తీసిన స్ఖానికులు

మృతులంతా దిండిక్కల్ భారతి పురానికి చెందినవారు. వీరిలో నాగరాజన్ (19), లోకనాథన్ (19), సెల్వభరణి (19) దిండిక్కల్​లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం రెండవ సంవత్సరం చదువుతున్నారు. భరత్​ (16) పదో తరగతి చదువుతుండగా, కార్తీక్​ ప్రభాకరన్ (19) ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details