ఓటరు మహాశయుడి తీర్పు వెల్లడైంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎవరు అధికారం చేపట్టనున్నారనే విషయం స్పష్టమైంది. బంగాల్లో అఖండ విజయంతో మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొట్టగా.. తమిళనాడులో దశాబ్ద కాలం తర్వాత డీఎంకే అధికారంలోకి రాబోతోంది. మరోవైపు, అసోంలో భాజపా అధికారాన్ని నిలుపుకొంది. పుదుచ్చేరిలో మెజారిటీ మార్కును అందుకుంది. కేరళలో కామ్రేడ్లు సత్తా చాటారు. చరిత్రను తిరగరాస్తూ అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన చోట ఏఏ పార్టీలు ఎన్ని సీట్లు దక్కించుకున్నాయో పరిశీలిస్తే..
బంగాల్- మొత్తం స్థానాలు 292
- తృణమూల్ కాంగ్రెస్ 213
- భాజపా 75(మరో రెండు చోట్ల ఆధిక్యం)
- వామపక్ష కూటమి 1
- ఇతరులు 1
అసోం- మొత్తం స్థానాలు 126
- భాజపా 75
- కాంగ్రెస్ కూటమి 50
- ఇతరులు 1
పుదుచ్చేరి- మొత్తం స్థానాలు 30
- కాంగ్రెస్ కూటమి 8
- ఎన్నార్ కాంగ్రెస్ కూటమి(ఎన్డీఏ) 16
- ఇతరులు 6