తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తండ్రి కర్కశత్వం.. తాంత్రికుడితో కలిసి కూతుళ్లపై రేప్.. సీఎంకు బాలికల లేఖ - తండ్రి అత్యాచారం బిహార్

father rape daughter: కన్నకూతుళ్లపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. కొడుకు పుట్టాలన్న ఆశతో ఓ తాంత్రికుడితో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. మరోవైపు, యూపీలోని కౌశంబిలో ఐదేళ్ల బాలికపై 13ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Five arrested raping minor
Five arrested raping minor

By

Published : May 21, 2022, 5:31 AM IST

father rape daughter:బిహార్​లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రి తన మైనర్ కూతుళ్లపై అత్యాచారం చేశాడు. బాధిత బాలికలు ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రికి లేఖ రాయగా.. విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఇద్దరు బాలికలు బక్సర్ జిల్లా రాజ్​పుర్ తాలుకాలో ఉంటున్నారు. వీరి తండ్రి నకిలీ వైద్యుడు. విటమిన్ ట్యాబ్లెట్ల పేరుతో బాలికలకు నిద్రమాత్రలు ఇచ్చేవాడు. అనంతరం తన స్నేహితుడైన ఓ తాంత్రికుడితో తన క్లీనిక్​లోనే అత్యాచారం చేయించేవాడు. కొద్దిరోజులకు తాను సైతం కూతుళ్లపై రేప్ చేయడం మొదలుపెట్టాడు. తండ్రిని ఎదురిస్తే తీవ్రంగా కొట్టేవాడని బాలికలు తెలిపారు. దీంతో అతడి హింసను తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయారు. బక్సర్​లో చిన్న అద్దె ఇంట్లో ఉండసాగారు.

అనంతరం, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులకు లేఖ రాశారు. తమపై జరిగిన లైంగిక దాడికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. బాలికల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదుగురిని అరెస్టు చేశారు. బాలికల తండ్రి, తల్లి, అత్తతో పాటు తాంత్రికుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. కొడుకు పుట్టాలన్న ఆశతోనే బాలికల తండ్రి ఇలా తాంత్రికుడితో కలిసి బరితెగించాడని వెల్లడించారు.

యూపీ గ్రేటర్ నోయిడాలో యువతీయువకుడు 22వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగింది. వీరిద్దరికీ గతంలోనే పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ఇదే అపార్ట్​మెంట్​లో యువకుడికి ఫ్లాట్ ఉందని చెప్పారు. యువతిది గాజియాబాద్ కాగా.. ఘటన జరిగిన రోజు యువకుడి వద్దకు వచ్చిందని వెల్లడించారు. వీరు మరణించడానికి గల కారణాలు తెలియలేదు.

UP rape case:యూపీలోని కౌశంబిలో ఐదేళ్ల బాలికపై 13ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మే 12న ఈ ఘటన జరిగింది. భౌతిక దాడి కేసుగా నమోదు చేసుకున్నప్పటికీ.. బాలిక ఆరోగ్యం క్రమంగా క్షీణించగా.. జరిగింది అత్యాచారమని ఆస్పత్రి వైద్యుల నివేదికలో తేలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గురుగ్రామ్​లో ఇద్దరు మైనర్లు 13ఏళ్ల బాలికపై రేప్ చేశారు. ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details