తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్‌ జైళ్ల నుంచి భారత్ చేరిన 20 మంది జాలర్లు

Fishermen returns form Pakistan : పాకిస్థాన్​ జైలు నుంచి 20 మంది మత్స్యకారులు విడుదల అయ్యి భారత్​ కు చేరుకున్నారు. వీరు సుమారుగా నాలుగేళ్ల పాటు అక్కడ శిక్ష అనుభవించారు. మన దేశానికి చెందిన సుమారు 560 మంది పాక్​ జైళ్లలో మగ్గుతున్నారని తాజాగా విడుదలైన వారు తెలిపారు. వారిని విడుదల చేసేందుకు కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

Fishermen return home from Pakistani jail
భారత్ చేరిన 20 మంది జాలర్లు

By

Published : Jan 28, 2022, 5:44 AM IST

Fishermen returns form Pakistan : నాలుగేళ్లుగా పాకిస్థాన్‌ జైల్లో మగ్గి విడుదలైన 20 మంది మత్స్యకారులు భారత్ చేరుకున్నారు. గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లా వేరవల్ పోర్టుకు చేరుకున్న జాలర్లు తమ కుటుంబ సభ్యులను కలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. వీరిలో 15 మంది గిర్ సోమ్‌నాథ్ జిల్లా వాసులు కాగా... మరో ఐదుగురు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారున్నారు.

భారత్ కు చేరిన 20 మంది జాలర్లు

పాకిస్థాన్ జైళ్లలో 560 మందికి పైగా మత్స్యకారులున్నారని, 1,148 కి పైగా పడవలు వారి అధీనంలో ఉన్నాయని పేర్కొన్నారు. వారందరినీ విడిపించేందుకు భారత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

సొంతూర్లకు చేరుకున్న జాలర్లు

ప్రభుత్వ, న్యాయసంబంధ ప్రక్రియలన్నీ పూర్తయ్యాక వారిని కుటుంబ సభ్యులతో కలిసి స్వస్థలాలకు పంపించారు అధికారులు. జైళ్లలో ఉన్న కొంత మంది భారతీయులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అక్కడ సరైన వసతులు లేవని తెలిపారు.

భారత్ చేరిన 20 మంది జాలర్లు

అన్నం, కనీస సౌకర్యాలు కూడా వారికి అందించడం లేదని తెలిపారు. వారికి ఎలాంటి అనారోగ్యానికి గురైనా ఒకే రకమైన మందులు ఇస్తారని వెల్లడించారు. దీంతో మత్స్యకారులంతా తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

UP Election 2022: 'అఖిలేశ్​​ అధికారంలోకి వస్తే.. మళ్లీ గూండా రాజ్యమే'

ABOUT THE AUTHOR

...view details