మధ్యప్రదేశ్లో తొలి వైట్ ఫంగస్ కేసు బయటపడింది. జబల్పుర్ వైద్య కళాశాలలో 55 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధరణ అయింది. ఇన్ఫెక్షన్తో రోగి ఆస్పత్రిలో చేరగా.. పరీక్షల్లో ఆయనకు వైట్ ఫంగస్ ఉన్నట్లు తేలింది.
"ఈ తరహా కేసులు ఏడాది పొడవునా వస్తుంటాయి. బ్లాక్ ఫంగస్ మాదిరిగా వైట్ ఫంగస్ ప్రమాదకరమేమీ కాదు. సాధారణ ఔషధాలతోనే దీన్ని తగ్గించవచ్చు."