కంబళ పరుగు పోటీలకు ఉన్న ప్రత్యేకత అంతాఇంతా కాదు. అయితే.. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని పక్కనపెట్టి తొలిసారి ఈ ఏడాది జరిగే పోటీల్లో యువతులు పాల్గొననున్నారు. దక్షిణ కర్ణాటకలోని తుళునాడులో ఈ ఏడాది నిర్వహించే కంబళ పోటీల్లో ఐదుగురు అమ్మాయిలు బరిలోకి దిగుతున్నారు.
ఈ ఏడాది కంబళ పోటీల్లో పాల్గొనేందుకు తమ తమ కూమార్తెలను ప్రోత్సహిస్తున్నామని కుటుంబసభ్యులు తెలిపారు.
గతేడాది.. కుందాపురక్కు చెందిన ఛైత్ర పరమేశ్వర్ భట్ తొలిసారిగా కంబళ పోటీల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. అయితే ఈ ఏడాది ఛైత్రతో పాటు మరో నలుగురు యువతులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతం వీరు శిక్షణలో ఉన్నారు.