తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం- మొదటి దశ పూర్తి - రామ మందిర నిర్మాణం మొదటి దశ

అయోధ్యలోని రామమందిర(Ayodhya Ram Mandir) నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మేరకు తొలి దశ నిర్మాణం పూర్తయినట్లు ఆలయ(Ram Mandir) ట్రస్ట్​ వర్గాలు తెలిపాయి.

ram temple
రామ మందిరం

By

Published : Sep 16, 2021, 10:30 PM IST

అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గురువారం నాటికి మందిరం తొలి దశ నిర్మాణం పూర్తయినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్(Ram Janmabhoomi)​ తెలిపింది. ఈ దశ నిర్మాణం విజయవంతంగా పూర్తవడంపై హర్షం వ్యక్తం చేసింది.

మొదటి దశ నిర్మాణం పూర్తి

ఈ మేరకు మందిర(Ram Mandir) నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళ్లారు ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. 12 గంటల నుంచి వర్షం ఎడతెరపిలేకుండా కురుస్తుండటం వల్ల కొద్ది మందే ఈ మందిర ప్రాంతానికి వచ్చారు.

శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు

"రెండో దశ నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తి చేస్తాం. కర్ణాటక గ్రానైట్, మిర్జాపుర్ సాండ్​స్టోన్​తో లేయర్​ వేయడం ప్రారంభించనున్నాం. ఆ తర్వాత మూడు నాలుగు నెలల వ్యవధిలో మరో దశ పూర్తి కానుంది. "

-చంపత్ రాయ్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి.

రామమందిర(Ayodhya Ram Mandir) నిర్మాణ కమిటీ తుది నిర్ణయం ప్రకారం.. అయోధ్యలోని ఈ ఆలయ ప్రాంగణంలో ఆరు మందిరాలను కట్టనున్నారు. ఆలయ ఫౌండేషన్ అక్టోబర్​ చివరికల్లా లేదా నవంబర్​ మొదటి వారం కల్లా పూర్తవుతుందని రామమందిర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.

పూర్తయిన ఆలయ మొదటి దశ నిర్మాణం

మరో రెండేళ్లలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని 5మండపాలు, గర్భగుడి పనులు పూర్తవుతాయని, 2023 డిసెంబరు నాటికి భక్తుల దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయట్రస్ట్‌ వర్గాలు ఇటీవలే తెలిపాయి.

ఇదీ చదవండి:

రామమందిరం కోసం రూ. కోటితో మరికొంత భూమి కొనుగోలు

అయోధ్య రామాలయ నిర్మాణానికి ఆ కొత్త టెక్నిక్​!

ABOUT THE AUTHOR

...view details