తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం తొలి దశ పోలింగ్​ ప్రశాంతం - తొలి దశ పోలింగ్​

అసోంలో తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 6 గంటలవరకు మొత్తం 72.14శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

first phase of polling in Assam
అసోం తొలి విడత ఎన్నికలు

By

Published : Mar 27, 2021, 6:46 PM IST

అసోం అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 72.14శాతం ఓటింగ్​ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చిన జనం.. కరోనా నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 47 స్థానాల్లో బరిలో నిలిచిన 264 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా.. వాటిని మార్చారు అధికారులు.

కొవిడ్​ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు
పోలింగ్​ కేంద్రాన్ని అందంగా ముస్తాబు చేసిన అధికారులు

మొత్తం 47 స్థానాలకు తొలి దశలో పోలింగ్​ జరిగింది. ఉదయం 7 గంటలకు ఓటింగ్​ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు 14.28 శాతం నమోదైంది. ఆ తర్వాత ఓటర్లు తరలిరావటం వల్ల.. ఓటింగ్​ శాతం క్రమంగా పుంజుకుంది.

పోలింగ్​ కేంద్రం వద్ద మహిళా ఓటర్లు
బారులు తీరిన జనం

ప్రముఖులు..

అసోం సీఎం సోనోవాల్ మజులీ స్థానం నుంచి ఈ దఫా ఎన్నికల్లో నిలిచారు. శాసనసభ సభాపతి హితేంద్రనాథ్ గోస్వామి జోరాట్ నుంచి, పీసీసీ అధ్యక్షుడు రిపున్​ బోరా గోపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచారు

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు వీరే..

కాంగ్రెస్​ నేత గౌరవ్​ గొగొయ్​.. జోర్హత్​ పోలింగ్​ బూత్​లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు
అసోం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్​.. దిబ్రుగఢ్​ పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు
సాముగురి కాంగ్రెస్​ అభ్యర్థి రాఖీబుల్​ హుస్సేన్​.. అమెని పోలింగ్​ బూత్​లో ఓటు వేశారు.
అసోం కాంగ్రెస్​ అధ్యక్షుడు రిపున్​ బోరా.. గోహ్​పుర్​ పోలింగ్​ బూత్​లో ఓటు వేశారు.

ABOUT THE AUTHOR

...view details