తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సవాళ్లను ఎదురీది ఎస్సైగా అనాథ యువతి.. ఆ రాష్ట్రంలో తొలిసారి... - sampark orphan si

FIRST ORPHAN SI: మహారాష్ట్రలో తొలిసారి ఓ అనాథ యువతి ఎస్సైగా ఎంపికైంది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చి.. ఉద్యోగాన్ని సంపాదించింది. తల్లిదండ్రులు లేరనే బాధను దిగమింగి.. పట్టుదలతో చదువుతో కుస్తీపట్టి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ఆ 'సుందరి' గాథ మీకోసం.

sundari police
sundari police

By

Published : Mar 27, 2022, 1:00 PM IST

FIRST ORPHAN SI: మహారాష్ట్రలో తొలిసారి ఓ అనాథ యువతి రాష్ట్ర పోలీస్ శాఖలో ఎస్సైగా ఎంపికైంది. కంప్యూటర్ ఇంజినీరింగ్​లో పట్టా సంపాదించిన సుందరి.. తొలి ప్రయత్నంలోనే సబ్ ఇన్​స్పెక్టర్​ ఉద్యోగాన్ని దక్కించుకుంది. కృషి, పట్టుదల, అంకితభావం ఉంటే.. ఎంతటి కష్టంలోనైనా విజయం సాధించవచ్చని నిరూపించింది.

సుందరి

Sundari Orphan SI:మూడేళ్ల వయసులోనే అనాథ శరణాలయానికి చేరుకుంది ఈ యువతి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను.. మాన్​ఖుర్ద్​లోని 'సంపర్క్ బాల్​గ్రామ్'​ ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్లారు. తల్లిదండ్రులెవరో తెలియదు. సొంత ఊరు అనేది లేదు. ఈ పరిస్థితుల్లో ఆశ్రమంలోని సిబ్బందే ఆమెను అల్లారుముద్దుగా పెంచారు. వీరి ఆప్యాయతల మధ్య పెరిగిన యువతి.. ఆశ్రమంపై ప్రేమను చాటుకుంది. అనాథ శరణాలయం పేరును తన పేరులో చేర్చుకుంది. సుందరి సంపర్క్ బాల్​గ్రామ్​గా మారిపోయింది.

పుస్తకాలతో దోస్తీ...

2014లో తన పద్దెనిమిదేళ్ల వయసులో సుందరి.. పైచదువుల కోసం ఆశ్రమాన్ని విడిచి బయటకు వెళ్లింది. పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకుంటూ కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకు వివాహం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న సుందరి కలకు.. ఆమె భర్త అండగా నిలిచారు. సుందరికి అన్ని విధాలా సహకరించారు.

ఏకాగ్రతతో చదువుకుంటూ..

భర్త నుంచి లభించిన పూర్తి సహకారంతో.. ఏకాగ్రతతో చదువుపై దృష్టిసారించింది. 2019లో సబ్ ఇన్​స్పెక్టర్ పరీక్ష రాసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సుందరి.. సబ్​ ఇన్​స్పెక్టర్​గా ఉద్యోగం సంపాదించింది. తల్లిదండ్రులు లేరన్న బాధను దిగమింగి.. జీవితంలో స్థిరపడేందుకు సుందరి చేసిన పోరాటం ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తోంది. నిరాశనిస్పృహలకు లోనుకాకుండా జీవితంలో పోరాటం కొనసాగించాలని సుందరి.. అందరికీ సందేశాన్ని అందిస్తోంది.

ఇదీ చదవండి:ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనం సూపర్.. నెలలో 15సార్లు స్వీట్లు

ABOUT THE AUTHOR

...view details