First Judge in Yellandu Tribal Area :సంకల్పం గట్టిదైతే సాధ్యం కానిది ఏమీ లేదని చెప్పే తండ్రి మాటలే స్ఫూర్తిగా లక్ష్య సాధనకు ప్రయత్నించారు జూనియర్ సివిల్ జడ్జి హారిక. ఆమె లక్ష్మయ్య, స్వరూప దంపతుల ముగ్గురు కుమార్తెల్లో ఒకరు. హారిక తండ్రి దర్జీ పనిచేసి కుటుంబాన్ని పోషించేవారు. ఆ సమయంలో వారి ఇంటి పక్కనే ఓ కోర్టు ఉండేది. అక్కడికి వచ్చే న్యాయవాదులు, న్యాయమూర్తులను చూసి తన కుమార్తెలో ఒకరిని న్యాయమూర్తిని చేయాలనుకున్నారాయన.. ఈలోగా సింగరేణి సంస్థ(Singareni Company)లో బదిలీ ఫిల్లర్ కార్మికుడిగా ఉద్యోగం దొరికింది. దాంతో 20 సంవత్సరాల పాటు గోదావరిఖని(Godavarikhani)లో పనిచేశారు. తర్వాత ఇల్లందు ఏరియాలో వంట కార్మికుడిగా నియమించడంతో మరల తిరిగి స్వస్థలానికి చేరారు.
Harika Appointed As Junior Civil Judge Warangal :పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చిన లక్ష్మయ్య.. వారు బాగా చదువుకోవాలని తపన పడుతూ ఉండేవాడు. తండ్రి ఆలోచనకు తగ్గట్టుగానే.. వారిలో హారిక చిన్నతనం నుంచీ చదువుల్లో చురుకు. ఆమె విద్యంతా గోదావరిఖని, కొత్తగూడెంలో జరిగింది. ఆపై బీఏ ఎల్‌ఎల్‌బీ కాకతీయ యూనివర్సిటీ(BA LLB in Kakatiya University)లో, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం(LLM) పూర్తి చేశారు.
CJ Justice Alok Aradhe : రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే
మొదటి న్యాయమూర్తి..గిరిజన ప్రాంతమైన ఇల్లందు చరిత్రలో ఇప్పటి వరకు న్యాయమూర్తిగా ఇక్కడివారెవరూ ఎంపిక కాలేదు. మొట్టమొదటిసారి హారిక ఈ ఘనత సాధించారు. 2022లో జేసీజే నోటిఫికేషన్(JCJ Notification) రావటంతో పగలురాత్రి శ్రమించారు. వేలల్లో రాసిన ఈ పరీక్షలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హారికన్యాయమూర్తిగా ఎంపికయ్యారు. వరంగల్ థర్డ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై తన తండ్రి కోరిక నెరవేర్చారు. 'లక్ష్యం ఎంచుకుంటేనే సాధించగలం. తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయాల్సింది మనమే. ఇందుకోసం ఓటమి గురించి ఆలోచించకుండా ఓపిగ్గా ప్రయత్నించాలి' అని అంటున్నారు జూనియర్ సివిల్ జడ్డిగా నియమితులైన ఇల్లుటూరి హారిక.
హారికను సన్మానించిన సింగరేణి సంస్థ : సింగరేణి గెస్ట్ హౌస్ ఉద్యోగి లక్ష్మయ్య కుమార్తె హనుమకొండ ఫస్ట్ క్లాస్ జడ్జిగా పోస్టింగ్ రావడం పట్ల ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్, అధికారులు హారికను కుటుంబ సభ్యులను అభినందిస్తూ.. జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఇల్లందు సింగరేణి గెస్ట్ హౌస్నందు కుక్గా లక్ష్మయ్య పనిచేస్తుండగా.. తల్లి సరస్వతి గృహిణి. వారి కూతురు హారిక పదవ తరగతి వరకు గోదావరిఖని సింగరేణి హైస్కూల్.. తర్వాత కొత్తగూడెం ఉమెన్స్ కాలేజీ నందు బీఏ ఎల్‌ఎల్‌బీ కాకతీయ యూనివర్సిటీ.. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. మార్చి 23వ తేదీన సివిల్ జడ్జి పరీక్ష ఫలితాలలో జడ్జిగా ఉద్యోగం సాధించిన హారికకు హనుమకొండ ఫస్ట్ క్లాస్ జడ్జిగా పోస్టింగ్ లభించింది. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు బంధుమిత్రులు హారికను అభినందించారు.
సుప్రీం ధర్మాసనంపై తెలుగు బిడ్డ.. జడ్జిగా జస్టిస్ సంజయ్ కుమార్ ప్రమాణం