తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లోకి కరోనా​ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్​కన్నా డేంజరస్! - corona new variant name

Omicron XE in India: కరోనా కొత్త వేరియంట్​ 'ఒమిక్రాన్​ ఎక్స్​ఈ' భారత్​లోకి ప్రవేశించింది. ముంబయిలో తొలి కేసును అధికారులు గుర్తించారు. అయితే.. ఇది ఎక్స్​ఈ వేరియంట కాకపోవచ్చని ఇన్సాకాగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

Omicron XE in India
భారత్​లోకి ఒమిక్రాన్​ కొత్త వేరియంట్.. ఆ నగరంలోనే తొలి కేసు!

By

Published : Apr 6, 2022, 6:17 PM IST

Updated : Apr 6, 2022, 7:35 PM IST

Omicron XE in India: కరోనా వైరస్​ ఒమిక్రాన్ రకం కన్నా 10శాతం వేగంగా వ్యాపించగల సరికొత్త వేరియంట్​ భారత్​లోనూ వెలుగుచూసింది. 'ఒమిక్రాన్​ ఎక్స్​ఈ' రకం కరోనా వైరస్​ను ముంబయిలో గుర్తించినట్లు బృహన్​ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. మొత్తం 376 సాంపిల్స్​కు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. ఒకరిలో ఎక్స్​ఈ, మరొకరిలో కప్పా వేరియంట్​ గుర్తించినట్లు వివరించారు. ఈ కొత్త వేరియంట్లు సోకిన రోగుల పరిస్థితి విషమంగా లేదని స్పష్టం చేశారు. ముంబయిలో తాము పరీక్షించిన 230 సాంపిల్స్​లో.. 228 కేసుల్లో ఒమిక్రాన్​గా తేలిందని ఆ అధికారి చెప్పారు.

భారత్​లో కొంతకాలంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 రకాల కలయికతో 'ఒమిక్రాన్​ ఎక్స్​ఈ' వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీఏ.2 రకంతో పోల్చితే ఒమిక్రాన్​ ఎక్స్​ఈ వేరియంట్​ 9.8శాతం అధికంగా వ్యాప్తి చెందే అవకాశముందని అంచనా వేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇటీవల ఇదే విషయం చెప్పింది.

అది కాదేమో..: ముంబయిలోని సాంపిల్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌కు చెందినదిగా ప్రస్తుత ఆధారాలు సూచించడంలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎక్స్‌ఈ వేరియంట్‌గా భావిస్తున్న సాంపిల్‌ ఫాస్ట్‌ క్యూ ఫైల్స్.. ఇన్‌సాకాగ్‌కు చెందిన జన్యు నిపుణులు క్షుణ్నంగా పరిశీలించినట్లు. ఆ సాంపిల్ జన్యుక్రమం ఎక్స్‌ఈ వేరియంట్‌ జన్యుచిత్రంతో సరిపోలడం లేదని ఆయా వర్గాలు వివరించాయి.

Last Updated : Apr 6, 2022, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details