తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగిసిన కేబినెట్ భేటీ- విద్యుత్‌ సెక్రటరీపై సీఎం సీరియస్ - సీఎండీ ప్రభాకర్ రావు

First Cabinet Meeting Chaired by CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌పై హాట్‌ హాట్‌గా చర్చ జరిగింది. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం మండిపడ్డారు.

cm revanth reddy
Telangana First Cabinet Meeting Today

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 4:01 PM IST

Updated : Dec 7, 2023, 11:02 PM IST

First Cabinet Meeting Chaired by CM Revanth Reddy : రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ తొలి మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth reddy) అధ్యక్షతన తొలి కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు, ఎలక్ట్రిసిటి డిపార్డ్‌మెంట్‌పై చర్చించారు. భేటీలో సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

మహిళలకు గుడ్ న్యూస్ - డిసెంబరు 9 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

CM Revanth reddy review on Electricity Department :తొలి కేబినెట్ సమావేశంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌పై హాట్‌ హాట్‌గా చర్చ జరిగింది. విద్యుత్‌ రివ్యూ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం మండిపడ్డారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు.

తెలంగాణ కొత్త మంత్రులు - వారికి కేటాయించిన శాఖలు ఇవే

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డారు. రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశించారు. రేపటి రివ్యూకు సీఎండీ ప్రభాకర్ రావును(CMD Prabhakar rao) రప్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. రేపు ఉదయం విద్యుత్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Telangana Cabinet Decisions :ఈనెల 9 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అదే రోజు 9న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటుందన్నారు. రాష్ట్రంలో తుపాను వల్ల నష్టపోయిన పంటలను మంత్రులు పరిశీలిస్తారని తెలిపారు.

పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తారని, రైతులకు పెట్టుబడి సాయంపై కేబినెట్‌ భేటీలో చర్చించామన్నారు. అన్ని వివరాలు ఇవ్వాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించామని, సమాచారం రాగానే హామీల అమలుపై దృష్టి సారిస్తామన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల విషయమై కేబినెట్‌లో చర్చించారని, అధికారుల నుంచి పూర్తి వివరాలు అందాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

సీఎం రేవంత్​కు శుభాకాంక్షల వెల్లువ - రాష్ట్ర ప్రగతికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామన్న ప్రధాని మోదీ

Last Updated : Dec 7, 2023, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details