బాలుడి తలకు తగిలిన బుల్లెట్ Firing range bullet hits boy:భద్రతా బలగాల ఫైరింగ్ ప్రాక్టీస్.. ఓ 11 ఏళ్ల బాలుడికి ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఘటన తమిళనాడు పుదుకొట్టయి జిల్లాలోని నర్తమళయి వద్ద జరిగింది.
అసలేమైందంటే..?
CISF firing practice: నర్తమళయిలోని ఫైరింగ్ రేంజ్లో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది ఫైరింగ్‌లో శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో ఓ తూటా దూసుకువచ్చి సమీపంలోని ఓ ఇంటి వద్ద ఉన్న పుఘళెంది(11) అనే బాలుడి తలకు తగిలింది. బాలుడు.. అమ్మచాతిరం గ్రామంలోని తన తాత ఇంటి ఎదురుగా నిల్చున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు తీవ్రంగా గాయపడ్డ పుఘళెందిని పుదుకొట్టయి వైద్య, కళాశాల ఆస్పత్రికి స్థానికులు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం.. తంజావూర్ వైద్య, కళాశాల ఆస్పత్రికి తరలించారు.
బాలుడికి తూటా తగిలిన ప్రదేశం పోలీసులతో బాధిత కుటుంబ సభ్యుల వాగ్వాదం రోడ్డుపై బాలుడి కుటుంబ సభ్యుల నిరసన దీనిపై పుదుకొట్టయి పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. బాలుడి తలకు ఒకే బుల్లెట్ తగిలిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే.. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా? అనే విషయాన్ని ఆయన నిర్ధరించలేదు. బాలుడు ఉన్న ఇంటికి, ఫైరింగ్ రేంజ్‌కు మధ్య 1.5 కిలోమీటర్ల దూరం ఉందని పేర్కొన్నారు.
ఈ ఘటన అనంతరం బాధిత బాలుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో.. ఫైరింగ్ రేంజ్‌ను మూసివేయాలని పుదుకొట్టయి కలెక్టర్ కవితా రాము ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి:యూట్యూబ్ చూసి దొంగ నోట్లు ప్రింటింగ్- ఇంజినీర్ అరెస్ట్
ఇదీ చూడండి:CCTV Video: ఘోర రోడ్డు ప్రమాదం... లక్కీగా ఆ ముగ్గురు సేఫ్!