Land dispute firing: భూతగాదాల్లో రెండు గ్రూప్‌ల మధ్య వివాదం కాల్పులకు దారి తీసింది. ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరపటం వల్ల మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన పంజాబ్‌లోని గుర్దాస్పుర్ జిల్లాలో సోమవారం జరిగింది. జిల్లాలోని ఫుల్లారా గ్రామానికి చెందిన సుఖ్రాజ్ సింగ్.. మరో ఇద్దరు సహచరులు జమల్ సింగ్, నిశాన్ సింగ్‌తో కలిసి బీస్ నగరానికి సమీపంలోని తన భూమిని చూసేందుకు వెళ్లాడు. అక్కడికి నిర్మల్ సింగ్ అనే వ్యక్తి తన సహచరులతో వచ్చి వారిపై కాల్పులకు తెగబడ్డారు. తూటాలు తగిలి సుఖ్రాజ్ సింగ్, జమల్ సింగ్, నిశాన్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
భూతగాదాలో పేలిన తూటాలు.. నలుగురు మృతి - కాల్పులు
Land dispute firing: రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న భూవివాదం నలుగురి ప్రాణాలు తీసింది. భూతగాదాలతో ఓ వర్గంపై మరోవర్గం కాల్పులు జరిపింది. ఈ ఘటన పంజాబ్, గుర్దాస్పుర్ జిల్లాలో సోమవారం జరిగింది.
సమాచారం అందుకున్న డీఎస్పీ కుల్విందర్ సింగ్.. సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఫుల్లారా గ్రామానికి చెందిన ముగ్గురితో పాటు దసుయాకు చెందిన మరో వర్గంలోని ఓ వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఒకరు గాయపడినట్లు తెలిపారు. సుఖ్రాజ్ సింగ్.. కాంగ్రెస్ మాజీ సర్పంచ్ లవ్జిత్ కౌర్ భర్తగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడికి చేరుకున్న బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:బాయ్‌ఫ్రెండ్ కారణంగా గర్భం.. యూట్యూబ్ చూసి అబార్షన్.. కానీ...