తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసులకు వ్యతిరేకంగా నిరసన- కాల్పుల్లో ముగ్గురు మృతి - బీజాపుర్​

పోలీసులు ఏర్పాటు చేసిన క్యాంప్​ను.. వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు ఛత్తీస్​గఢ్​లోని సిల్గేర్​ గ్రామస్థులు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్రమై.. కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది.

firing-during-protest-against-police-camp-in-bijapur
సిల్గేర్​లో పోలీసుల కాల్పులు

By

Published : May 17, 2021, 5:26 PM IST

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​లోని సిల్గేర్​ గ్రామంలో పోలీసులు, స్థానికుల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.

గ్రామంలో పోలీసులు క్యాంప్​ ఏర్పాటు చేయగా దీనిని వ్యతిరేకించిన స్థానికులు.. రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఘర్షణ తీవ్రమైంది. కాల్పులకు దారితీసింది.

కాల్పుల్లో ముగ్గురు మృతి

చనిపోయింది నక్సల్సే..

క్యాంప్​తో తమకు ప్రమాదమని తెలిసి.. నక్సలైట్లే గ్రామస్థుల సాయంతో నిరసనలకు దిగారని తెలిపారు బస్తర్ ఐజీ. నక్సలైట్లు దాడికి తెగబడగా.. తాము జరిపిన ఎదురుకాల్పుల్లో వారిలో కొందరు చనిపోయారని పేర్కొన్నారు.

అయితే.. చనిపోయిందా నక్సలైట్లా, గ్రామస్థులా అనేది స్పష్టత లేదు.

ఇదీ చూడండి: స్టాలిన్ సూపర్ రాజకీయం.. అన్నాడీఎంకే నేతకు చోటు

ABOUT THE AUTHOR

...view details