తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇసుక' దొంగల ముఠాల మధ్య కాల్పులు.. నలుగురు మృతి

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ముఠాల మధ్య తలెత్తిన ఓ వివాదం కాల్పుల వరకు వెళ్లింది. ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరపుకోవడం వల్ల నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బిహార్‌లో జరిగింది.

firing-between-two-groups-over-sand-in-bihta-patna
firing-between-two-groups-over-sand-in-bihta-patna

By

Published : Sep 29, 2022, 6:18 PM IST

బిహార్​లోని పట్నా జిల్లాలో విషాదం నెలకొంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ముఠాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో మాటామాటా పెరిగి ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. తొమ్మిది మంది గాయపడ్డారు.

ఘటనా స్థలిలో పోలీసులు

పోలీసుల సమాచారం ప్రకారం..జిల్లాలోనిబిహ్తా పోలీస్​స్టేషన్ పరిధిలోని సోన్ నది తీరంలోని ఇసుకను కొందరు ముఠాలుగా ఏర్పడి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున రెండు గ్రూపుల మధ్య ఇసుక రవాణా విషయంలో చిన్న వివాదం తలెత్తింది. అనంతరం మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఇరు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు.

ఘటనాస్థలి వద్ద స్థానికులు

ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు.. సోన్​ నది వద్దకు చేరుకున్నారు. మృతులను మానేర్ పోలీస్​స్టేషన్‌ పరిధికి చెందిన శతృఘ్న, హరేంద్ర, లాల్‌దేవ్​, విమలేశ్​ కుమార్​గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాల కోసం సోన్​ నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

సహాయక చర్యలు

ఇవీ చదవండి:'అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు'.. గహ్లోత్ ప్రకటన.. సోనియాకు క్షమాపణ

పాఠశాల విద్యార్థుల పడవ బోల్తా.. అనేక మంది గల్లంతు

ABOUT THE AUTHOR

...view details