త్రిపురలో భారీ అగ్ని ప్రమాదం (Fire accident latest news) సంభవించింది. ఉత్తర త్రిపుర జిల్లా పానీసాగర్ పట్టణంలో 18 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు వ్యాప్తి చెందకుండా మరో 11 గుడిసెలను ధ్వంసం చేశారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందు చర్యలు చేపట్టారు.