తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Act of God: 'అగ్నిప్రమాదాలను దేవుడి చర్యగా పరిగణించలేం'

Act of God: ప్రకృతి వైపరీత్యం లేకుండా జరిగిన అగ్నిప్రమాదాలను దేవుడి చర్యగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ మద్యం కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంపై అలహాబాద్​ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

By

Published : Jan 8, 2022, 4:15 PM IST

supreme court act of india
సుప్రీంకోర్టు

అగ్నిప్రమాదాలను దేవుడి చర్యగా పరిగణలోకి తీసుకోరాదని సుప్రీంకోర్డు స్పష్టం చేసింది. తుఫాను, వరదలు, పిడుగుపాటు, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించిన అగ్నిప్రమాదాలను మాత్రమే దేవుడి చర్యగా పరిగణించాలని తెలిపింది. 2003లో ఓ మద్యం కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదాన్ని దేవుడి చర్యగా పేర్కొంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ జస్టిస్​ ఏఎం ఖాన్వీల్కర్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెల్లడించింది. అగ్ని ప్రమాదం ప్రకృతి వైపరీత్యం కారణంగా జరగనందున దాన్ని మానవతప్పిందంగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది.

కేసు వివరాలు..

2003లో ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ మద్యం కంపెనీకి చెందిన గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎక్సైజ్​ శాఖ అధికారులు సంబంధిత సంస్థ నష్టపరిహారం కింద రూ. 6.39 కోట్లను ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను అలహాబాద్​ హైకోర్టు కొట్టి వేసింది. అగ్నిప్రమాదం నిర్లక్ష్యం కారణంగా జరిగినట్లు ఆధారాలు లేవని, ఇది దేవుడి చర్యగా పేర్కొంటూ తీర్పును ఇచ్చింది. దీనిపై అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మానవ తప్పిదం కారణంగా జరిగిందని స్పష్టం చేసింది.

"2003, ఏప్రిల్​ 10న మధ్యాహ్నం 12.55 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటన దేవుడి చర్యగా పరిగణించలేం. ఘటన జరిగిన సమయంలో తగిన చర్యలు చేపట్టి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది కాదు. ఈ కేసుకు సంబంధించి అలహాబాద్​ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదు."

-సుప్రీంకోర్టు

ఇదీ చూడండి :భారత్‌లో 32 లక్షల మంది కరోనాతో మృతి?

ABOUT THE AUTHOR

...view details