తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బస్సు, కారు ఢీ- ఐదుగురు సజీవ దహనం

ఝార్ఖండ్​లో ఘోర ప్రమాదం (Jharkhand accident) జరిగింది. ఎదురెదురుగా వస్తున్న బస్సు, కారు ఢీకొన్నాయి. అనంతరం కారులో మంటలు చెలరేగగా.. ఐదుగురు సజీవ దహనమయ్యారు.

jharkhands-ramgarh-car bus accident
బస్సు, కారు ఢీ

By

Published : Sep 15, 2021, 12:00 PM IST

Updated : Sep 15, 2021, 1:01 PM IST

ప్రమాద దృశ్యాలు

ఝార్ఖండ్ రామ్​గఢ్ (Jharkhand's Ramgarh) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు బస్సు ఢీకొట్టడం వల్ల ఐదుగురు దుర్మరణం చెందారు.

బస్సును ఢీకొట్టిన కారు

ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు తలెత్తాయి. అనంతరం బస్సుకూ మంటలు వ్యాపించాయి. దీంతో ఐదుగురు ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు.

బస్సులో నుంచి ఎగసిపడుతున్న మంటలు

రాజ్​రప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్బంద వద్ద 23వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ టీనేజీ అబ్బాయి ఉన్నారని తెలిపారు. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.

బాధితులు పట్నాకు చెందినవారని పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఫ్లైఓవర్​పై కారు, బైకు ఢీ.. 30 అడుగుల ఎత్తు నుంచి పడి ఇద్దరు...

Last Updated : Sep 15, 2021, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details