ప్రమాదవశాత్తు బాణాసంచా పేలి 40 మందికి పైగా గాయపడ్డ ఘటన ఒడిశాలో జరిగింది. కార్తీకేశ్వర స్వామి నిమజ్జనం నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
దేవుడి నిమజ్జనంలో బాణాసంచా పేలుడు.. 40 మందికి తీవ్ర గాయాలు - పూజా వేడుకల్లో అగ్ని ప్రమాదం
ఒడిశాలోని ప్రమాదవశాత్తు బాణాసంచా పేలి 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కార్తీకేశ్వర స్వామి నిమజ్జన కార్యక్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు కథనం ప్రకారం.. కేంద్రపార జిల్లాలోని బాలియా బజార్లో ఈ ఘటన జరిగింది. నిమజ్జన కార్యక్రమంలో వివిధ పూజా వేదికల వద్ద బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో ఓ నిప్పురవ్వ బాణాసంచా నిల్వ ఉన్న సంచిలో పడింది. దీంతో తీవ్ర మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితులందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. జిల్లా ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు వారిని ఎస్బీఎమ్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.