దిల్లీలోని బవానా జేజే కాలనీలోని మురికివాడలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200 ఇళ్లు కాలి బూడిదయ్యాయి.
అకస్మాత్తుగా మంటలు చెలరేగగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఇళ్లు మంటలకు కాలిపోవడం వల్ల పలువురు నిరాశ్రయులయ్యారు. సమయానికి ఘటనాస్థలికి చేరిసన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడం వల్ల ఈ నష్టం 200 ఇళ్లకు పరిమితమైందని అధికారులు వెల్లడించారు. లేదంటే మంటలు ఈ మురికివాడలో వేల సంఖ్యలో ఉన్న ఇళ్లు అన్నింటికీ వ్యాపించేవని అభిప్రాయపడ్డారు.
నిరాశ్రయులను తాత్కాలిక శిబిరాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.