గుజరాత్ రాజ్‌కోట్‌లోని కొవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడం వల్ల.. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనా రోగులు మృతిచెందారు.
మావాది ప్రాంతంలోని ఉదయ్ శివానంద్ ఆసుపత్రిలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయానికి అందులో మొత్తం 33 మంది కొవిడ్ బాధితులు ఉండగా.. మిగిలిన 27 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వారిని ఇతర వైద్యశాలకు తరలించినట్టు సమాచారం.
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే.. ప్రమాదానికి కారణం తెలియరాలేదు.