ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తక్షణమే రోగులను ఖాళీ చేయించి.. వారికి తగిన సౌకర్యాలను కల్పించాలని ఆధికారులకు సూచించారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.