తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతుల నిరసన స్థలంలో అగ్ని ప్రమాదం- టెంట్​లు దగ్ధం - అగ్నిప్రమాదం

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన స్థలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రైతులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక టెంట్​లు కాలి బుడిదయ్యాయి. హరియాణాలోని కుండ్లీ సరిహద్దుల్లో ఈ ప్రమాదం జరిగింది.

Fire at farmers' protest site
రైతుల నిరసన స్థలంలో అగ్ని ప్రమాదం

By

Published : Nov 5, 2021, 1:48 PM IST

హరియాణా సోనిపత్​ జిల్లాలో రైతుల ఆందోళన చేస్తున్న ప్రదేశంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుండ్లీ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో అన్నదాతలు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టెంట్​లు పూర్తిగా కాలిపోయాయి. ఎలాంటి ప్రాణానష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

సోనిపత్​ జీటీ రోడ్‌లోని రసోయి ధాబా ముందు ఈ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

అయితే రైతుల ఉద్యమాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని.. అగ్ని ప్రమాదం కూడా ప్రభుత్వ కుట్రేనని రైతునేత జంగ్వీర్​ సింగ్​ చౌహాన్​ ఆరోపించారు. రైతులు ఐక్యంగా ఉన్నారని.. వారిని విడదీయలేరన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు నిరసన చేపట్టి.. ఈ నెల 25 నాటికి ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రైతులు నిరసనలను ఉద్ధృతం చేశారు.

ఇదీ చూడండి:విషాదం.. టపాసులు పేలి తండ్రీకొడుకులు మృతి

ABOUT THE AUTHOR

...view details