తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో మంటలు- తప్పిన ప్రమాదం - ghaziabad railway station

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​ రైల్వే స్టేషన్​ వద్ద నిలిపి ఉన్న శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనకు గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.

fire
శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో అగ్ని ప్రమాదం

By

Published : Mar 20, 2021, 8:24 AM IST

Updated : Mar 20, 2021, 10:15 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​ రైల్వే స్టేషన్​ వద్ద నిలిపి ఉన్న శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. దిల్లీ నుంచి లఖ్​నవూ వెళ్తున్న ఈ రైలులో జనరేటర్​ కార్​ నుంచి మంటలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 6.45కి జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది

మంటలు చెలరేగిన బోగీని రైలు నుంచి వేరు చేయడం వల్ల ప్రయాణికులకు ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు 8.20 గంటలకు లఖ్​నవూ బయలుదేరినట్లు చెప్పారు.

అయితే.. ఘటనకు గల కారణాల ఇంకా తెలియరాలేదని, షార్ట్​ సర్క్యూట్​ అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి :రిజర్వేషన్లు ఇంకెన్ని తరాలు?: సుప్రీం

Last Updated : Mar 20, 2021, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details