తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీరం' ప్రమాద మృతులకు రూ.25 లక్షల పరిహారం

fire in serum institute
పుణె సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం

By

Published : Jan 21, 2021, 3:09 PM IST

Updated : Jan 21, 2021, 8:15 PM IST

20:14 January 21

'సీరం' ప్రమాద మృతులకు రూ.25 లక్షల పరిహారం!

పుణెలోని తమ సంస్థలో అగ్ని ప్రమాదం జరగటంపై విచారం వ్యక్తం చేసింది సీరం ఇన్​స్టిట్యూట్​. 'ఈరోజు మనకు చాలు దురదృష్టకరమైన రోజు. ఘటనతో చాలా బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు మా సంతాపం. నిబంధనల ప్రకారం అందాల్సిన నగదుతో పాటు అదనంగా మరో రూ.25 లక్షల పరిహారం ప్రకటిస్తున్నాం.' అని పేర్కొన్నారు సీరం ఇన్​స్టిట్యూట్​ ఛైర్మన్​ సైరస్​ పూనవాలా.

20:07 January 21

సీరం ప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్​ దిగ్భ్రాంతి

మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  

19:51 January 21

ప్రధాని మోదీ విచారం

పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియాలో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవటంపై విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

19:32 January 21

మరో కంపార్ట్​మెంట్​లో మంటలు

సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం జరిగిన అదే భవనంలోని మరో కంపార్ట్​మెంట్​లో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.  

17:52 January 21

ఐదుగురు మృతి

సీరం ఇన్​స్టిట్యూట్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.10 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేశారు. 

16:23 January 21

రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం

సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం సంభవించగా.. ఇప్పటికే 10 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రంగంలోకి జాతీయ విపత్తు స్పందనా దళం (ఎన్​డీఆర్​ఎఫ్​) దిగింది. 

15:07 January 21

పుణె సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం

పుణె సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం

మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం జరిగింది. టెర్మినల్ గేట్​ 1 వద్ద ఎస్​ఈజెడ్​-3 భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు 10 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పని చేసే శాస్త్రవేత్తలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఈ ఘటన వల్ల కరోనా టీకా ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం ఉండదని సీరం సంస్థ ప్రకటించింది.

కరోనా నివారణ కోసం సీరం ఇన్​స్టిట్యూట్​ తయారు చేసిన కొవిషీల్డ్​ టీకా వినియోగానికి కేంద్రం ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం ఫ్రంట్​లైన్​ వర్కర్లకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందిస్తున్నారు.

Last Updated : Jan 21, 2021, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details