దేశ రాజధాని దిల్లీలోని మాయాపురి ప్రాంతంలోని ఓ మాస్క్ తయారీ పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
తెల్లవారుజామున 3.50 గంటలకు తమకు సమాచారం అందినట్లు తెలిపారు అగ్నిమాపక సిబ్బంది. వెంటనే 6 అగ్నిమాపక వాహనాలతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు చెప్పారు.
" పరిశ్రమలోని మూడో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. తలుపులు బద్దలుకొట్టి ముగ్గురిని రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. అందులో ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతన్ని దీన్‌దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించాం. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుడు జగుల్ కిశోర్‌గా తెలిసింది. "