తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​ కేర్​ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం-10 మంది మృతి - ఆసుపత్రిలో మంటలు

ముంబయిలోని ఓ కొవిడ్ కేర్ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది మృతిచెందారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

fire breaks out in hospital
అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్​గ్రేషియా

By

Published : Mar 26, 2021, 6:57 AM IST

Updated : Mar 26, 2021, 3:00 PM IST

ముంబయిలోని ఓ కొవిడ్ కేర్ ఆసుపత్రిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది కొవిడ్ రోగులు చనిపోయారు. భాండుప్ ప్రాంతంలో ఓ మాల్లో మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన సన్​రైజ్ ప్రైవేటు ఆసుపత్రిలో.. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.

కొవిడ్ కేర్ ఆసుపత్రిలో మంటలు
ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు

ఈ ఆసుపత్రిలో ఉన్న 76 మంది రోగులను ఇతర ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు చేపట్టారు.

సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

ఘటనా స్థలాన్ని సందర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం ప్రకటించారు.

ఆసుపత్రిలో మంటలు
ముంబయి కొవిడ్ కేర్ ఆసుపత్రి

ఇద్దరు మాత్రమే..

అయితే.. అగ్నిప్రమాదం వల్ల ఆసుపత్రిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్​తో మృతిచెందిన ఇద్దరిని అగ్నిప్రమాదం అనంతరం బయటకు తీసుకువచ్చినట్లు తెలిపాయి. అన్ని నిబంధనల ప్రకారమే ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి:ఏటీఎం నుంచి రూ.45 లక్షలు చోరీ

Last Updated : Mar 26, 2021, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details