తమిళనాడు విరుధానగర్జిల్లా అచ్చంకుళం గ్రామంలోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగి 16 మంది మరణించారు. 33 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పది అగ్నిమాపక యంత్రాలతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- 16 మంది మృతి - Fire breaks out at a firecracker factory in Virudhunagar ,16 dead
15:28 February 12
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
బాణసంచా తయారు చేయడానికి రసాయనాలు కలుపుతుండగా పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం పళనిస్వామి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్రం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారం అందిస్తామని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి లక్ష రూపాయలు పరిహారం అందిస్తామని సీఎం పళనిస్వామి ప్రకటించారు.
TAGGED:
6 dead