తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు రైళ్లలో అగ్నిప్రమాదం- దగ్ధమైన బోగీలు - రైలులో మంటలు

Fire accident in train: కాసగంజ్​ ప్యాసింజర్​ రైలు జనరల్​ బోగీలో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన ప్రయాణికులు రైలు నుంచి దూకడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఉత్తర్​ప్రదేశ్​ ఫరుఖాబాద్​ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు.. బిహార్​లోని గయా రైల్వే స్టేషన్​లో నిలిపి ఉంచిన ఓ రైలు స్లీపర్​ బోగీలో మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది.

fire-accident-in-train
రెండు రైళ్లలో అగ్నిప్రమాదం

By

Published : Dec 27, 2021, 12:01 PM IST

Updated : Dec 27, 2021, 12:44 PM IST

రెండు రైళ్లలో అగ్నిప్రమాదం

Fire accident in train: ఉత్తర్​ప్రదేశ్​ ఫరుఖాబాద్​ జిల్లాలో కాసగంజ్​ ప్యాసింజర్​ రైలు జనరల్​ బోగీలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వే సిబ్బంది, ప్రయాణికుల సాయంతో బోగీని వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశాయి అగ్నిమాపక దళాలు.

జిల్లాలోని హరసింహాపుర్​ గోవా హాల్ట్​ సమీపంలో జనరల్​ బోగీ ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. హథియాపుర్​ రైల్వే క్రాసింగ్​ వద్ద ట్రైన్​ను నిలిపివేశారు. రైల్వే గార్డ్స్​, ప్రయాణికులు బోగీని రైలు నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. హుటాహుటిన రెండు వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, బోగీ దగ్ధమైన క్రమంలో నష్టంపై అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మంటల్లో కాలిపోతున్న జనరల్​ బోగీ

"ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే రెండు అగ్నమాపక యంత్రాలు 12.35 గంటలకు చేరుకున్నాయి. 1.15 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. పొగ అలుముకున్న నేపథ్యంలో లోపలికి వెళ్లలేని పరిస్థితి. అందులోకి వెళ్లిన తర్వాతే ఎవరైనా ఉన్నారా? అని తెలుస్తుంది. మంటల వ్యాప్తి నేపథ్యంలో పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకటం వల్ల గాయపడ్డారు."- వీరేంద్ర కుమార్​, ఆర్​పీఎఫ్​ ఇన్​స్పెక్టర్​

సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు ఉన్నతాధికారులు. దగ్ధమైన బోగి స్థానంలో 9 అదనపు బోగీలను అమర్చి రైలును పంపించారు.

నిలిపి ఉంచిన రైలులో మంటలు

Train fire accident in Bihar: బిహార్​లోని గయా రైల్వే స్టేషన్​లో ప్లాట్​ఫామ్​పై నిలిపి ఉంచిన రైలు స్లీపర్​ క్లాస్​ బోగీలో మంటలు అంటుకున్నాయి. దీంతో రైల్వే స్టేషన్​లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సమాచారం అందిన వెంటనే పలు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

గయా స్టేషన్​లో దగ్ధమవుతున్న బోగీ

ఇదీ చూడండి:బ్రేకులు ఫెయిలై రెండు రైళ్లు ఢీ- దూకేసిన డ్రైవర్లు!

Last Updated : Dec 27, 2021, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details