Fire accident in train: సికింద్రాబాద్-దానాపుర్ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ బోగీల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించగా ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. బోగీలో పొగలు రావడం గమనించిన కొందరు ప్రయాణికులు సిబ్బందిని అప్రమత్తంగా చేసినట్లు పేర్కొన్నారు. రైలును వెంటనే నిలిపివేసినట్లు చెప్పారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ వద్ద జరిగింది.
ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. 'బీడీ'నే కారణం! - Betul Fire at Secunderabad Danapur Express train
Fire accident in train: సికింద్రాబాద్- దానాపుర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని జనరల్ బోగీల్లో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ వద్ద జరిగింది.
స్టేషన్ కంటే ముందుగానే రైలును నిలిపివేయడం వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిందని తెలుసుకొని కొందరు బేతుల్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండే అండర్ బ్రిడ్జి వద్ద దిగినట్లు వివరించారు. అనంతరం రైలును బేతుల్ స్టేషన్‌కు తీసుకెళ్లగా.. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పినట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ప్రయాణికుల్లో ఓ వ్యక్తి బీడీ కాల్చి ఎలక్ట్రిక్ బాక్స్‌లో వేసినట్లు అనుమానిస్తున్నారు. దీంతో షార్ట్ సర్కూట్ అయ్యి ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:కచోడీ కోసం ట్రైన్ ఆపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే?