Fire accident: తిరుపతి బాణసంచా గిడ్డంగిలో అగ్నిప్రమాదం, ముగ్గురు సజీవదహనం - బాణసంచా గిడ్డంగిలో అగ్ని ప్రమాదం
16:50 May 31
బాణసంచా గిడ్డంగిలో అగ్నిప్రమాదం, ఒకరు మృతి
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లిలో బాణాసంచా గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు కూలీలు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గూడూరుకు చెందిన ఏడుకోండలు, కువ్వాకుల్లి గ్రామానికి చెందిన శంకరయ్య, నాగేంద్ర మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో బాణాసంచ గిడ్డంగి యజమాని వీరరాఘవులతో పాటు కూలీ కళ్యాణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాద కారణాల పై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. తొమ్మిది మంది మృతి.. మరో ఏడుగురికి గాయాలు
ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో పాటు బాణాసంచా తయారీలో చోటు చేసుకున్న పొరపాటుతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అగ్నిప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే సుళ్ళూరుపేట నుంచి అగ్నిమాపక శకటాలు సంఘటనాస్ధలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో గాయపడ్డవారిని మెరుగైన చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తరలించారు.