తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లో చెలరేగిన మంటలు.. ఇద్దరు చిన్నారులు సజీవ దహనం - ఇంట్లో చెలరేగిన మంటలు

Fire Accident in House: ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​ జిల్లాలో జరిగింది.

fire accident in house
fire accident in house

By

Published : Feb 4, 2022, 3:52 AM IST

Fire Accident in House: ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్​ జిల్లా శతాబ్దిపురం ప్రాంతంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు మరణించారు. ఘటనా సమయంలో ఇంట్లో ఉన్న తల్లి.. ముగ్గురు పిల్లలను కాపాడగా.. మరో ఇద్దరు సజీవ దహనమయ్యారు.

అగ్ని ప్రమాదం జరిగిన ఇల్లు

కారణమిదే..!

కవినగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని శతాబ్దిపురంలో ఓ కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. కుటుంబ యజమాని పని కోసం బయటకు వెళ్లాడు. ఇంట్లో తల్లి, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఏమైందో తెలియదుగానీ.. ఒక్కసారిగా ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన తల్లి.. ముగ్గురు చిన్నారులను కాపాడింది. ఈ క్రమంలో మరో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణమేంటన్నది తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్​, సిలిండర్‌ లీక్‌ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఘటనపై ఆరా తీస్తున్న సిబ్బంది

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details