ఝార్ఖండ్ ధన్బాద్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో వైద్య దంపతులు సహా ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎనిమిది అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. బ్యాంక్మోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వేకువజామున జరిగిందీ ఘటన.
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. వైద్య దంపతులు సహా ఐదుగురు మృతి - అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి
ఝార్ఖండ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో వైద్య దంపతులతో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
వికాస్ హజ్రా, ప్రేమ హజ్రా అనే దంపతులిద్దరూ వృత్తిరీత్యా వైద్యులు. వీరు ఆస్పత్రిలోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న స్టోర్ రూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ ఏర్పడింది. ఈ పొగ వల్ల ఊపిరాడక వైద్య దంపతులు సహా వారి మేనల్లుడు, పనిమనిషి, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో ఉన్న రోగులకు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంతాపం వ్యక్తం చేశారు.
Last Updated : Jan 28, 2023, 10:52 AM IST