దిల్లీలోని మోతీనగర్‌లో ఉండే హార్లే డేవిడ్సన్ బైక్ షోరూంలో మంటలు చేలరేగాయి. ఈ ఘటన శనివారం(జనవరి 2) తెల్లవారుజామున ఒంటిగంట తరువాత జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. మంటల్లో చిక్కకున్న నలుగురుని కాపాడినట్లు తెలిపారు.
హార్లే డేవిడ్సన్ బైక్ షోరూంలో మంటలు - హార్లే డేవిడ్ సన్ బైక్ షోరూంలో మంటలు
దిల్లీలోని హార్లే డేవిడ్సన్స్ బైక్ షోరూం లో మంటలు చెలరేగాయి. తెల్లవారు జామున ఒంటిగంట తరువాత జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
దిల్లీలోని హార్లే డేవిడ్సన్ బైక్ షోరూంలో మంటలు
సమాచరం అందిన వెంటనే మంటల్ని ఆర్పడానికి 25 అగ్ని మాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. మంటల్ని ఆర్పడానికి దాదాపు నాలుగున్నర గంటల సమయం పట్టిందని తెలిపారు. భవంతిలోని మొదటి రెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. కాగా మూడో అంతస్తులో నైట్‌క్లబ్, ఓ రెస్టారెంట్ ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం... 18 లక్షల మేర ఆస్తినష్టం
TAGGED:
fire accident in delhi