బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ముగ్గురు మృతి - బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
11:02 January 01
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ముగ్గురు మృతి
తమిళనాడు శివకాశిలోని ఎం.పుడుపట్టి గ్రామంలో ఉన్న వడివెల్ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని పుడుపట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాణసంచా కర్మాగారంలో పేలుడుపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బాణసంచా తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగనట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.
Last Updated : Jan 1, 2022, 11:38 AM IST