Fire Accident in Dumping Ground: దిల్లీ భలస్వా ప్రాంతంలోని డంపింగ్ యార్డులో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. నివాసిత ప్రాంతాల సమీపానే ఈ ప్రమాదం జరగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వ్యాపించకుండా కట్టడి చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారు.
డంపింగ్‌యార్డులో భారీ అగ్ని ప్రమాదం.. ఇళ్లకు వ్యాపించకుండా.. - దిల్లీలో అగ్ని ప్రమాదం
Fire Accident: దిల్లీలోని డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై నివేదిక సమర్పించాలని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ అధికారులను ఆదేశించారు.
fire
ఈ ఘటనపై స్పందించిన పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్.. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్‌లో వ్యర్థాల నుంచి మీథేన్ ఉత్పత్తి అవుతుందని.. ఎండాకాలంలో ఈ మీథేన్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి :'మోదీజీ.. దయచేసి ఇక ఆపేయండి ప్లీజ్'