ఝార్ఖండ్ ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 400 మంది నివాసం ఉంటున్న 13 అంతస్తుల అపార్ట్మెంట్లో భారీగా మంటలు చెలరేగి.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
జోడా పాఠక్ ప్రాంతంలోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది అపార్ట్మెంట్ వాసులు మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అపార్ట్మెంట్లో 400 మంది ఉంటున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. వెంటనే మంటలు ఆర్పే ప్రక్రియ ప్రారంభించాయి.
అపార్ట్మెంట్లో మంటలు.. 14 మంది సజీవదహనం.. అనేక మంది ట్రాప్! - jharkhand breaking news 14 died in fire accident
అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మరణించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఘార్ఖండ్లో అగ్నిప్రమాదం
ఝార్ఖండ్ ధన్బాద్లో అగ్నిప్రమాదం
మృతుల్లో నలుగురు చిన్నారులు సైతం ఉన్నారని అధికారులు తెలిపారు. మంటలకు గల కారణం ఇంకా తెలియలేదు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మొత్తం ఐదు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించినట్లు చెప్పారు. 10కి పైగా అంబులెన్సులను పిలిపించినట్లు వెల్లడించారు. ఆశీర్వాద్ అపార్ట్మెంట్స్ స్థానికంగా ఉన్న అతిపెద్ద నివాస సమూదాయం. ఈ అపార్ట్మెంట్లో సుమారు వంద ఫ్లాట్లు ఉన్నాయని, 400 మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు.
Last Updated : Jan 31, 2023, 10:58 PM IST